పోలియోరహిత దేశం అందరి లక్ష్యం కావాలి

1 Feb, 2021 04:06 IST|Sakshi
ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసంలో చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

పల్స్‌ పోలియో టీకాలను ప్రారంభించిన గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

తన నివాసంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: పోలియో రహిత దేశమే అందరి లక్ష్యం కావాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. విజయవాడ రాజ్‌భవన్‌లో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని గవర్నర్‌ ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 52.72 లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వాల కృషితో 2011 నుంచి దేశంలో పోలియో కేసు నమోదు కాకపోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ కార్యదర్శి ముఖేశ్‌కుమార్‌ మీనా, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్, రాష్ట్ర రోగనిరోధక అధికారి దేవి తదితరులు పాల్గొన్నారు.
చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న గవర్నర్‌  విశ్వభూషణ్‌ హరిచందన్‌ 

పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులతో సీఎం నివాసానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు