ఆ ఘటన నా మనసును కలచివేసింది: సీఎం జగన్‌

22 Jun, 2021 12:55 IST|Sakshi

ప్రకాశం బ్యారేజీ వద్ద చోటు చేసుకున్న ఘటన దురదృష్టకరం: సీఎం జగన్‌

సాక్షి, తాడేపలి: ప్రకాశం బ్యారేజీ వద్ద నర్సింగ్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన తన మనసును కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఎక్కడా జరగకూడదన్నారు. మహిళలు అర్ధరాత్రి కూడా తిరగగలిగే పరిస్థితి ఉన్నప్పుడే.. నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు గట్టిగా నమ్మే వ్యక్తిని తానని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఇక మీదట ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

మహిళల కోసం దిశ, అభయం యాప్‌లతో పాటు వారి రక్షణ కోసం దిశ చట్టం చేశాం అన్నారు సీఎం జగన్‌. మహిళల రక్షణకై దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులను నియమించాం.. మహిళల కోసం ప్రత్యేకంగా 900 మొబైల్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశామని సీఎం జగన్‌ తెలిపారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే డీజీపీ డి.గౌతం సవాంగ్‌ను సీఎం జగన్‌ సోమవారం తన క్యాంప్‌ కార్యాలయానికి పిలిపించుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకూడదని.. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు.

చదవండి: అత్యాచార ఘటనపై సర్కారు సీరియస్‌ 

మరిన్ని వార్తలు