కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు రూ. 10 లక్షలు.. ఉత్తర్వులు జారీ

19 May, 2021 21:04 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కోవిడ్ వల్ల అనాథలైన పిల్లలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇందుకు సంబంధించి బుధవారం వైద్య ఆరోగ్య శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ వల్ల తల్లిదండ్రులు ఇద్దరు మరణించిన.. 18 ఏళ్ల లోపు వారికి ఈ పథకం వర్తిస్తుంది. తల్లిదండ్రులిద్దరు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబలకు చెందిన వారై ఉండాలని అధికారులు తెలిపారు. 

కరోనాతో కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరుపై ప్రభుత్వం రూ.10 లక్షల డిపాజిట్‌ చేయనుందని తెలిపారు. ఆ మొత్తంపై వచ్చే వడ్డీని ప్రతినెలా ఇచ్చేలా లబ్దిదారులకు అందించేలా కార్యాచరణ రూపొం‍దించినట్లు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఏకే సింఘాల్‌ వెల్లడించిన  సంగతి తెలిసిందే. 

చదవండి: అనాథ పిల్లల పేరున రూ.10 లక్షల డిపాజిట్‌: ఏ.కె.సింఘాల్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు