వార్డుల అభివృద్ధికి ఎంత ఖర్చయినా వెనుకాడొద్దు: సీఎం జగన్‌

7 Jun, 2021 15:51 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా వైరస్‌ నివారణ చర్యలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమీక్ష సందర్భంగా.. గర్భిణులు, చిన్నపిల్లల కోవిడ్‌ చికిత్సపై సీఎం జగన్‌ దృష్టి సారించారు. యుద్ధ ప్రాతిపదికన పిల్లల వార్డుల అభివృద్ధికి, మెడికల్‌ కాలేజీల్లో పీడియాట్రిక్‌ వార్డుల అభివృద్ధికి ఆదేశించారు. వార్డుల అభివృద్ధికి ఎంత ఖర్చయినా వెనుకాడొద్దని స్పష్టం చేశారు.

అత్యుత్తమ పీడియాట్రిక్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. చిన్నపిల్లల కోసం 3 కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని, విశాఖ, కృష్ణా-గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో పీడియాట్రిక్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దాదాపు రూ.180 కోట్ల చొప్పున ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి.. ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

ఇక్కడ చదవండి: రాష్ట్రాభివృద్ధికి బంగారు బాట
Andhra Pradesh: చెప్పినవే కాదు... చెప్పనివీ చేశాం

మరిన్ని వార్తలు