పులివెందుల డెవ‌ల‌ప్‌మెంట్‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌

31 Jul, 2020 20:36 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(పాడా)పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు. గతంలో చేసిన శంకుస్థాపనలు, పనుల పురోగతి, బడ్జెట్‌ కేటాయింపులపై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవ‌స‌ర‌మైన నిధులు విడుద‌ల చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఎర్రబల్లి, గండికోట రిజర్వాయర్‌ నుంచి 40 రోజుల్లో పార్నపల్లి, పైడిపాలెం డ్యామ్‌లకు నీటి సరఫరా చేసే ప్రాజెక్ట్‌కు పరిపాలనా ఆమోదం తెలిపారు. అనంత‌రం జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ స్కీమ్, అలవలపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ పనుల పురోగతిపై ఆరా తీశారు. పులివెందుల బ్రాంచ్‌ కెనాల్, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, గండికోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ల పురోగతి గురించి అధికారులు సీఎం జ‌గ‌న్‌కు వివ‌రించారు. (విద్యార్థుల అభీష్టమే ఫైనల్)

చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 10 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజి అమలు చేయడం కోసం రూ. 261.90 కోట్ల నిధులు విడుదలకు పరిపాలనా అనుమతులపై చర్చించారు. 154 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, మొగమేరు వంకపై ఫ్లడ్‌బ్యాంక్స్‌ మరియు చెక్‌డ్యామ్‌ల ఆమోదంపైనా మాట్లాడారు. పులివెందులలో ఆర్‌ అండ్‌ బి రోడ్ల నిర్మాణం, వేంపల్లి యుజిడి, సింహాద్రిపురం డ్రైనేజ్‌ సిస్టమ్, ముద్దనూరు–కొడికొండ చెక్‌పోస్ట్‌ రోడ్‌ పనులు, పులివెందుల మోడల్‌ టౌన్‌ ప్రపోజల్స్, న్యూ బస్‌ స్టేషన్, మినీ సెక్రటేరియట్, పులివెందుల మెడికల్‌ కాలేజి ఏర్పాటు, వేంపల్లిలో కొత్త డిగ్రీ కాలేజి, వేంపల్లి ఉర్దూ జూనియర్‌ కాలేజి, నాడు నేడు స్కూల్స్‌ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఏపీ కార్ల్‌ భూముల వినియోగం గురించి చ‌ర్చ‌లో ప్ర‌స్తావించారు. పులివెందుల క్రికెట్‌ స్టేడియం, ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటుకు సంబంధించిన అంశాల‌పైనా దృష్టి సారించారు. ఈ భేటీలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, పడా ప్ర‌త్యేక అధికారి‌ అనీల్‌ కుమార్‌ రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. (ఆగస్టులో చేయూత.. సెప్టెంబర్‌లో ఆసరా)

మరిన్ని వార్తలు