మట్టిలోని మాణిక్యాలను సానపట్టగలిగితే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లొచ్చు: సీఎం జగన్‌

13 Feb, 2024 20:45 IST|Sakshi

CM YS Jagan Vishaka Visit Updates

6:52PM, Feb 13, 2024

‘ఆడుదాం ఆంధ్రా’  ముగింపు కార్యక్రమంలో సీఎం జగన్‌ ప్రసంగం

 • ఆడుదాం ఆంధ్ర.. ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అనేది దీని ఉద్దేశం. 
 • రెండో ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరూ ఎప్పుడూ ఊహించని పద్ధతిలో మట్టిలోని మాణిక్యాలను గుర్తించగలిగితే, సానపట్టగలిగితే, సరైన శిక్షణ ఇవ్వగలిగితే మనం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాం. 
 • క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్మాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడల్లో గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నాం. 
 • 25.40 లక్షల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. 3.30 లక్షల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయి. 

 • 1.24 లక్షల పోటీలు మండల స్థాయిలో, 7346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో, 1731 పోటీలు జిల్లా స్థాయిలో, 260 మ్యాచ్‌లు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాం. 
 • ఈరోజు ఫైనల్స్ ముగించుకొని ఈ విశాఖలో, ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తిగారి గడ్డమీద సగర్వంగా ముగింపు సమావేశాలు నిర్వహిస్తున్నాం. 
 • దాదాపు 37 కోట్ల రూపాయల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చాం.
 • 12.21 కోట్ల రూపాయల బహుమతులు ఈరోజు పోటీలో పాలుపంచుకున్న మన పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతోంది. 
 • ఈ కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీరితోపాటు మిగతా ఆటలకు సంబంధించిన ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారంతా పాల్గొంటూ ట్యాలెంట్‌ కలిగిన 14 మందిని వాళ్లు దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. 

 • క్రికెట్ నుంచి ఇద్దరు పిల్లలకు, ఇద్దరు చెల్లెమ్మలకు నలుగురిని గుర్తించాం. 
 • కబడ్డీ నుంచి ముగ్గురు మగపిల్లలు, ఒక చెల్లెమ్మను గుర్తించాం. 
 • వాలీబాల్ నుంచి ఒక మగపిల్లాడు, ఒక చెల్లెమ్మ, ఖోఖో నుంచి ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. 
 • బ్యాడ్మింటన్ నుంచి కూడా ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. 
 • వీళ్లకు ఇంకా సరైన ట్రైనింగ్ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే పరిస్థితి ఉంటుందని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా అడుగులు వేయగలిగాం. 
 •  పవన్ (విజయనగరం), కేవీఎం విష్ణువర్ధిని (ఎన్టీఆర్ జిల్లా) చెల్లెమ్మ.. వీళ్లిదరినీ చెన్నై సూపర్ కింగ్స్ దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా శ్రీకారం చుట్టారు. 
 • శివ (అనపర్తికి), కుమారి గాయత్రి (కడప జిల్లా) చెల్లెమ్మను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది.  
 • కబడ్డీకి సంబంధించి సతీష్ (తిరుపతి), బాలకృష్ణారెడ్డి (బాపట్ల), సుమన్ (తిరుపతి) ఈ ముగ్గురినీ కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ టీమ్ దత్తత తీసుకుంది. 
 • సుమన్‌ను, సంధ్య (విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. 
 • వాలీబాల్ కు సంబంధించి ఎం.సత్యం (శ్రీకాకుళం), మహిళలకు సంబంధించి మౌనిక (బాపట్ల) వీళ్లిద్దరినీ బ్లాక్ హాక్స్ సంస్థ దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చింది. 
 • ఖోఖోకు సంబంధించి కె.రామ్మోహన్ (బాపట్ల), హేమావతి (ప్రకాశం)ని ఖోఖోలో తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది. 
 • బ్యాడ్మింటన్ ఎ.వంశీకృష్ణంరాజు (ఏలూరు), ఎం.ఆకాంక్ష (బాపట్ల) వీళ్లిద్దరినీ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చింది. 
 • వీళ్లందరికీ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. పైన పేర్కొన్న సంస్థలు కలిసి ఒక్కటై మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకుఅ డుగులు ముందుకు పడుతున్నాయి.
 • ఈరోజు మనం చేసిన అడుగు ప్రతి సంవత్సరం జరుగుతుంది. 
 • మన పిల్లల్ని ఐడెంటిఫై చేసిమరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తాం. 
 • సచివాలయ పరిధి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తూ, వ్యాయామానికి సంబంధించిన వ్యాల్యూను, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను మరింతగా ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సహించే కార్యక్రమం.
 • వీటివల్ల మరింత ప్రోత్సాహం ఆటలకు జరగాలి. మన పిల్లలకు మరింత మంచి జరగాలని మనసారా కోరుకుంటూ పిల్లలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. థ్యాంక్యూ.

 • కబడ్డీకి సంబంధించి సతీష్‌(తిరుపతి జిల్లా), కృష్ణారెడ్డి(బాపట్ల) వీరిని ప్రొ కబడ్డీ టీమ్‌ దత్తత తీసుకోవడం జరిగింది.
 • సుమన్‌(తిరుపతి జిల్లా), సంధ్య(విశాఖపట్నం)లను ఏపీ కబడ్డీ అసోసియేషన్‌దత్తత తీసుకోవడానికి ము​ందుకొచ్చింది
 • వాలీబాల్‌కు సంబంధించి ఎం సత్యం అని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తమ్ముడిని, మౌనిక(బాపట్ల)లను వీరిద్దర్నీ దత్తత తీసుకోవడానికి బ్లాక్‌ హాక్స్‌ సంస్థ ముందుకొచ్చింది
 • ఖోఖోకు సంబంధించి కె రామ్మోహన్‌(బాపట్ల) అనే తమ్ముడిని, హేమావతి(ప్రకాశం)అనే చెల్లెమ్మను  దత్తత తీసుకోవడానికి ఏపీ ఖోఖో అసోసియేషన్‌ ముందుకొచ్చింది
 • బ్యాడ్మింటన్‌కు సంబంధించి ఎ. వంశీకృష్ణ(ఏలూరు జిల్లా),  ఎం ఆకాంక్ష(బాపట్ల)లను ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ముందుకొచ్చింది
   

6:50PM, Feb 13, 2024

 • ‘ఆడుదాం ఆంధ్రా’  ముగింపు వేడుకల్లో భాగంగా  లైట్‌ షో ప్రదర్శన
 • తిలకిస్తున్న సీఎం జగన్‌ 

 • ‘ఆడుదాం ఆంధ్రా’  ముగింపు వేడుకల్లో భాగంగా  వివిధ విభాగాల్లో కళాకారుల నృత్య ప్రదర్శన
 • వీక్షించిన సీఎం జగన్‌
   
 • ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రత్యేక గీతాన్ని స్టేడియంలో ప్లే చేశారు

6:30PM, Feb 13, 2024

ఆరు వికెట్ల తేడాతో విశాఖపై ఏలూరు క్రికెట్‌ జట్టుపై విజయం

 • ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీల్లో భాగంగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో విశాఖ క్రికెట్‌ జట్టుపై ఏలూరు జట్టు విజయం సాధించింది 

 6:15PM, Feb 13, 2024

 • వేదికపై నుంచి సీఎం జగన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను తిలకించారు.
 • సీఎం జగన్‌ చప్పట్లు కొడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు

6:00PM, Feb 13, 2024

 • సీఎం జగన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు
 • చివరి ఐదు ఓవర్ల మ్యాచ్‌ను సీఎం జగన్‌ వీక్షిస్తున్నారు
 • విశాఖ-ఏలూరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది
 • సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియానికి చేరుకున్నారు
   

5:23PM, Feb 13, 2024

 • విశాఖ చేరుకున్న సీఎం జగన్‌

4:55 PM, Feb 13, 2024

 • కాసేపట్లో విశాఖ చేరుకోనున్న సీఎం వైఎస్‌ జగన్‌

4:18PM, Feb 13, 2024

 • విశాఖకు బయల్దేరిన సీఎం వైఎస్‌ జగన్‌
 • నేటితో ముగియనున్న ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు
 • ముగింపు వేడుకలకు హాజరుకానున్న సీఎం వైఎస్‌ జగన్‌

2:50PM, Feb 13, 2024

 • కాసేపట్లో విశాఖపట్నం బయల్దేరనున్న సీఎం వైఎస్‌ జగన్‌
 • నేటితో ముగియనున్న ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు
 • ముగింపు వేడుకలకు హాజరుకానున్న సీఎం వైఎస్‌ జగన్‌
 • 50 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా జరిగిన క్రీడలు 
 • విజేతలకు బహుమతులు అందజేయనున్న సీఎం జగన్‌
 • క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించేందుకే ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు
 • గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోటీలు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. విశాఖ సాగర తీరంలో ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.

ఇందుకోసం సీఎం జగన్‌ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. పీఎం పాలెంలోని వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియానికి వెళ్లి క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు.  అనంతరం అక్కడి నుంచి  తాడేపల్లికి చేరుకుంటారు.

ఇకపై ఏటా ఆడుదాం.. 
మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ మెగా టోర్నీని నిర్వహించింది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 50 రోజులపాటు ఈ క్రీడా సంబరాలు కొనసాగాయి. మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు తమ ప్రతిభ కనబరిచారు. ఇందులో 17,59,263 మంది పురుషులు, 7,81,709 మంది మహిళా క్రీడాకారులున్నారు. వీరికి దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్‌ కిట్లను ప్రభుత్వం అందించింది.

గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో 3.30 లక్షలు, మండల స్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గ స్థాయిలో 7,346, జిల్లా స్థాయిలో 1,731, రాష్ట్ర స్థాయిలో 260 మ్యాచ్‌లను దిగ్విజయంగా నిర్వహించింది. వివిధ దశల్లో విజే­తలకు రూ.12.21 కోట్ల నగదు బహుమతులిస్తోంది. తొలి ఏడాది పోటీలు విజయవంతం కావడంతో భవి­­ష్యత్‌లో మరింత ఎక్కువ మంది గ్రామీణ క్రీడా­కారులను పరిచయం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇకపై ప్రతి ఏటా ‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహించేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.  

భారీగా నగదు బహుమతులు 
విశాఖ వేదికగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి పోటీలు సోమవారం ముగిశాయి. మెన్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ మంగళవారం విశాఖలోని వైఎస్సార్‌ స్టేడియంలో జరగనుంది. ముగింపు వేడుకలకు హాజరవుతున్న సీఎం జగన్‌ చివరి ఐదు ఓవర్లను వీక్షించనున్నారు. అనంతరం క్రీడల వారీగా విజేతలకు సీఎం జగన్‌ నగదు బహుమతులను అందజేస్తారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు రూ.5 లక్షల చొప్పున, రన్నరప్‌లకు రూ.3 లక్షలు, సెకండ్‌ రన్నరప్‌లకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నారు. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో విజేతలు రూ.2 లక్షలు, రన్నరప్‌ రూ.లక్ష, సెకండ్‌ రన్నరప్‌ రూ.50 వేలు అందుకోనున్నారు.  

ప్రతిభకు ప్రోత్సాహం.. 
ఈ మెగా టోర్నీ ద్వారా ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చెన్నై సూపర్‌ సింగ్స్‌(సీఎస్‌కే)తో పాటు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా క్రికెట్‌లో టాలెంట్‌ హంట్‌ నిర్వహించింది. ప్రో కబడ్డీ, బ్లాక్‌ హాక్స్‌ వాలీబాల్‌ ఫ్రాంచైజీలతో పాటు ఏపీకి చెందిన ఖోఖో, కబడ్డీ క్రీడా సంఘాలు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల బృందాలు కూడా ఈ ఎంపికలో భాగస్వామ్యులయ్యాయి. ఎంపికైన క్రీడాకారులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దనుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు