పాదయాత్రపై స్థానికుల సంభాషణ

16 Nov, 2020 09:34 IST|Sakshi

ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాదయాత్ర చేపడుతున్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి మద్దతుగా పదరా.. ఒక అడుగేద్దాం అంటున్నారు నియోజకవర్గంలోని ప్రజలు. ఈ పాదయాత్రపై స్థానికుల సంభాషణ సాగిందిలా..         
–చిత్తూరు రూరల్‌ 

పెద్దరాయుడు:  ఏం బా సుబ్బరాయుడు యాడా పొలం కాడికి పోతా ఉండావా. 
సుబ్బారాయుడు:  అవున్నో..పైరుకు నీళ్లు పెట్టాలి.  

పెద్దరాయుడు: రాబ్బా పోదువు..కరెంటు 9 గంటలు ఉండాది కదా.. 
సుబ్బారాయుడు:  ఏమ్‌ లేదున్నో..గవర్నమెంట్‌ మా అకౌంట్లో రూ.2 వేలు వేసి ఉండాదినా . నా భార్యను పంపించి ఉండా.. తీసుకో రమ్మని. 

పెద్దరాయుడు: యాడ్రా వాళ్లంతా నడుచుకుంటా పోతాండారు  
సుబ్బారాయుడు:: మన జగనన్న పాదయాత్ర సేసి మూడేళ్ల అయిందంటనా. 

పెద్దరాయుడు: ఓహో...జగన్‌ అప్పుడు మన ఊరు పక్క కూడా వచ్చినాడు కదరా.. 
సుబ్బారాయుడు: అవున్నో..మనం పొయ్యినాం కదా!  

పెద్దరాయుడు: నాకు రైతు భరోసాతోపాటు రూ.2,250 పింఛన్‌ వస్తా ఉండాది.  
సుబ్బారాయుడు: అవును నా భార్యకు ఒళ్లు సరిలేదని రూ. 5వేలు, మనవడికి అమ్మఒడి, నా చిన్న కొడుక్కి, రేషన్‌కార్డు, కష్టకాలంలో ఉండారని రూ.వెయ్యి ఇచ్చినారు. 

పెద్దరాయుడు: ఇదంతా ఎందుకు చేస్తా ఉండారు... 
సుబ్బారాయుడు: వాళ్ల నాయన మాదిరిగా జగన్‌కూడా పాదయాత్ర చేసి ఊళ్లో వాళ్ల కష్టం తెలుసున్నాడు కదా. 341 రోజులు, అన్ని ఊళ్లు తిరుగుతూ జనం కష్టం, ఊళ్లో కష్టాలను కళ్లరా చూసారాబ్బా. ఇన్నీ రోజులు సేయడమంటే ఏం తమాషానా..? 

పెద్దరాయుడు: అవునబ్బో జనం కోసం ఇదంతా చేస్తుండాడు. సెప్పిన తేదీకి కరెక్టుగా చేస్తుండారు. మాట మీద నిలబడే వ్యక్తి అని నిరూపించుకున్నాడబ్బా. 
సుబ్బారాయుడు: అవున్నో.. అప్పుడు మాదిరి ఇప్పుడు లేదున్నో.. మనకు ఏం కావాలన్నా ఇంటికి వలంటీర్లు  వస్తుండారు. 

పెద్దరాయుడు: మరి మనకోసం ఇంత చేస్తున్నాడు కదా.! అప్పుడెట్టాగో ఆయనతో పాటు నడవలేక పోయాం.. ఇప్పుడు ఆయనకు మద్దతుగా మనం కూడా పదాం.. ఈళ్లతో పాటు ఒక అడుగు వేద్దామా.  
సుబ్బారాయుడుసరే ఆ సేద్యం ఎప్పుడూ ఉండేదే కానీ, నేనూ వస్తా ఒకడుగేద్దాం పద.

మరిన్ని వార్తలు