నీవే స్ఫూర్తి.. నీదే కీర్తి

2 Sep, 2021 08:31 IST|Sakshi

వైఎస్సార్‌తోనే ప్రగతి అడుగులు 

సంక్షేమానికి చిరునామా రాజశేఖరుడే

సిక్కోలు గుండెల్లో ఆయనది చెరిగిపోని స్థానం 

నేడు వైఎస్సార్‌ వర్ధంతి   

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మాటిస్తే నిలబెట్టుకోవాలి. హామీ ఇస్తే ఎలాగైనా అమలు చేయాలి. కష్టాన్ని కనిపెట్టి కన్నీరు తుడవాలి.. మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి నేర్పిన పాఠాలివి. ముఖ్యమంత్రిగా ఆయ న అనుసరించిన విధానాలూ ఇవే. అందుకే మరణించాక కూడా ఆయన జనం గుండెల్లో బతికున్నారు. సంక్షేమానికి ఆయన పేరునే శాశ్వత చిరునామాగా మార్చేశారు. ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ఉద్దానానికి మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ పరిశోధన కేంద్రం వంటి ప్రాజెక్టులతో సిక్కోలుపై వరాలు కురిపిస్తున్నారు.  

వైఎస్సార్‌ హయాంలో.
శ్రీకాకుళానికి ఓ పెద్దాసుపత్రి ఉండాల్సిందేనని భావించి ప్రజలు కోరకుండానే రిమ్స్‌ వైద్య కళాశాలను, ఆస్పత్రిని నిర్మించారు.   

సిక్కోలు జిల్లాకు యూనివర్సిటీని అందించారు. ఎచ్చెర్లలో 2008 జూలై 25న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ ఏర్పాటు చేశారు. ఇప్పుడీ వర్సిటీ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నత విద్యావేత్తలుగా తీర్చిదిద్దుతోంది. 

ఎచ్చెర్లలో ట్రిపుల్‌ ఐటీని ఏర్పాటు చేశారు.  

ప్రతి చుక్క నీటిని అందిపుచ్చుకుని, రైతుకు అందించాలని అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 2005 మే నెలలో వంశధార స్టేజ్‌ 2, ఫేజ్‌2 ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 20 మండలాల్లో 2.55లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తలపెట్టారు. 

జిల్లాలోని హిరమండలం వద్ద సుమారు 10వేల ఎకరాల్లో 19 టీఎంసీల నీటి నిల్వ కోసం రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టారు. తోటపల్లి ఫేజ్‌ 2 పనుల ఘనత ఆయనకే దక్కుతుంది. 

సాగునీరు, పలాస పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.123.25 కోట్లతో ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 

వంశధార, నాగావళి నదుల అనుసంధానం పనులు పూర్తయితే 2.55లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని వైఎస్సార్‌ అప్పట్లోనే పనులకు శ్రీకారం చుట్టారు. 

∙12,500 ఎకరాల సాగునీటి కోసం మడ్డువలస ప్రాజెక్టు స్టేజ్‌ 1 పనులను రూ.57.87కోట్లతో చేపట్టారు. 

నాగావళి, వంశధార నదుల వరద ఉద్ధృతి నుంచి పంట పొలాలను, ఆవాసాలను రక్షించేందుకు రూ. 300కోట్లతో కరకట్టల నిర్మాణాలకు సంకల్పించారు.

సీతంపేట ఏజెన్సీలో 14 వేల ఎకరాల్లో 5వేల మంది గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చారు.  

రైతులను ఆదుకున్న ఏకైక నేత వైఎస్సారే. 2.5లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశారు. అప్పటికే రుణాలు చెల్లించేసిన వారికి రూ. 5వేలు చొప్పున ప్రోత్సాహం అందించారు.  

చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పేదలకు 1,80,817 ఇళ్లు మంజూరు చేసి అందులో 1,63,140ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు.  

నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించాలన్న సంకల్పంతో 2007లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీతో వేలాది మందికి జీవం పోశారు. 938 రకాల వ్యాధులకు కార్పొరేట్‌ వైద్యం అందించారు. 

ప్రమాద బాధితులకు అత్యవసర సమయంలో ఆస్పత్రిలో చేర్పించి ప్రాణం నిలబెట్టవచ్చని 108 అంబులెన్స్‌లను ప్రారంభించారు. గ్రామీణులకు ప్రతి నెలా వైద్యం అందించడానికి 104 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. 

పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్‌ చదువులు అందించాలనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉన్నత విద్యాభ్యాసానికి కొండంత అండగా నిలిచారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో బీసీ విద్యార్థులే 72 వేలకు పైగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు