వైఎస్‌ రాజారెడ్డి ఆదర్శప్రాయుడు 

24 May, 2021 10:49 IST|Sakshi
వైఎస్‌ రాజారెడ్డి సమాధి వద్ద పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతమ్మ తదితరులు   

వైఎస్‌ రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ  

పులివెందుల: దివంగత వైఎస్‌ రాజారెడ్డి ఆదర్శప్రాయుడని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్‌ విజయమ్మ పేర్కొన్నారు. ఆదివారం వైఎస్‌ రాజారెడ్డి 23వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్‌ కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్‌ సమాధుల తోటలో  వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ జయమ్మల సమాధుల వద్ద వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్‌ భారతమ్మ, వైఎస్సార్‌ సోదరుడు వైఎస్‌ సుదీకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సింహాద్రిపురం, లింగాల మండలాల ఇన్‌ఛార్జి ఎన్‌.శివప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్‌ సమీప బంధువు క్రిష్టఫర్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అక్కడే ఉన్న వైఎస్‌ జార్జిరెడ్డి, వైఎస్‌ వివేకానందరెడ్డి, డాక్టర్‌ ఇసీ గంగిరెడ్డిల సమాధులతోపాటు ఇతర బంధువుల సమాధుల వద్ద పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చిన్నప్ప, వైఎస్సార్‌సీపీ నాయకులు రసూల్, జగదీశ్వరరెడ్డి, పార్నపల్లె నాయుడు, కృష్ణమ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

నివాళులర్పించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే   
స్థానిక వైఎస్సార్‌ సమాధుల తోటలోని వైఎస్‌ రాజారెడ్డి సమాధి వద్ద ఆదివారం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్‌ రాజారెడ్డి పేద ప్రజలపట్ల ఎంతో ప్రేమతో మెలిగేవారన్నారు. ప్రతి ఒక్కరు పేద ప్రజలకు సేవ చేయాలని ఆయన చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.

చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి అరెస్ట్‌  
‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు