YSR Birth Anniversary: తండ్రి బాటలో తనయుడు

7 Jul, 2021 12:32 IST|Sakshi

వెబ్‌డెస్క్‌: రైతులకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే అన్నాడో ముఖ్యమంత్రి. ఆయన తర్వాత ఆ పదవిలోకి వచ్చిన చీఫ్‌ మినిష్టర్‌ మొదటి సంతకాన్ని రైతులకు ఉచిత విద్యుత్‌ అందించే ఫైలుపైనే చేశారు. ఇప్పటికే పద్దెనిమిదేళ్లు గడిచిపోయాయి. ఎవరూ కరెంటు తీగలపై బట్టలు ఆరేయడం లేదు, కానీ పంట చేలలలోకి నీరు పరవళ్లు తొక్కుతూనే ఉంది... రైతు కళ్లలో వెలుగులు విరజిమ్ముతూనే ఉన్నాయి. ఇందులో మొదటి ముఖ్యమంత్రి సీబీఎన్‌ అయితే రెండో చీఫ్‌ మినిష్టర్‌ డాక్టర్‌ వైఎస్సార్‌.

రైతు దినోత్సవం
రైతు కష్టాలే తన కష్టాలుగా భావించారు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. అందుకే ధైర్యంగా తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ప్రకటించారు. దానికి తగ్గట్టే రైతులకు ఉచిత విద్యుత్‌, సాగునీరు అందించేందుకు జలయజ్ఞం, రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేశారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రైతుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా లెక్కకు మిక్కిలిగా పథకాలు అమలు చేస్తున్నారు. రైతు పక్షపాతి అయిన వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఆ మహనీయుడి స్ఫూర్తితో రైతు దినోత్సవం రోజున భారీ ఎత్తున రైతు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. 

రైతు దినోత్సవం సందర్భంగా ఏపీలో జులై 8న చేపడుతున్న ప్రారంభోత్సవ కార్యక్రమాలు
► రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో రూ. 413.76 కోట్లతో నిర్మించిన 1,986 రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం. 
► రూ. 79.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 100 వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌, ఆక్వా, సీఏడీడీఎల్‌ ల్యాబ్‌లు
► రూ. 96.64 కోట్ల వ్యయంతో తొలి విడత నిర్మించిన 645 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు 
► రూ. 31.74 కోట్ల వ్యయంతో నిర్మించిన 53 కొత్త వెటర్నిటీ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రూరల్‌ లైవ్‌స్టాక్‌ యూనిట్లు
► పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రూ.7.53 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన టెలిమెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ ప్రారంభం.
► రూ. 3 కోట్ల వ్యయంతో ఆరు కొత్త రైతు బజార్లు

రైతు దినోత్సవం సందర్భంగా ఏపీలో జులై 8న చేపడుతున్న శంకుస్థాపన కార్యక్రమాలు

  • రైతు భరోసా కేంద్రాల స్థాయిలో 1,262 గోడౌన్ల నిర్మాణాలు. దీని కోసం రూ. 400.30 కోట్ల కేటాయించారు
  • రూ. 2000.17 కోట్ల వ్యయంతో ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి పోస్ట్‌హార్వెస్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెంటర్‌ ఏర్పాటు పనులు
  • అనకాపల్లిలో బెల్లం, రాజమండ్రిలో అరటి, శ్రీకాకుళంలో జీడిపప్పు, చిత్తూరులో మామిడి, బాపట్లలో చిరుధాన్యాలు, వైఎస్సార్‌ కడపలో అరటి, హిందూపురంలో వేరుశనగ, కర్నూలులో టమాటా ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణ పనులు
  • నాడు-నేడు కింద రూ. 212.31 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్‌ యార్డుల్లో అభివృద్ధి పనులు
  • రూ. 45 కోట్ల వ్యయంతో కొత్తగా 45 రైతు బజార్ల ఏర్పాటు
  • వైఎస్సార్‌కడప జిల్లా ఊటుకూరులో రూ. 2 కోట్ల వ్యయంతో కడక్‌నాథ్‌ పౌల్ట్రీ ఏర్పాటు
  • రూ. 15 కోట్లతో నాబార్డు ప్రాజెక్టు
మరిన్ని వార్తలు