మీలాంటి అన్నదమ్ములుంటే ఏ లోటూ రాదు

13 Aug, 2020 03:17 IST|Sakshi
సంతోషం వ్యక్తం చేస్తున్న విశాఖలోని పిఠాపురం కాలనీ మహిళలు

‘వైఎస్సార్‌ చేయూత’ లబ్ధిదారుల సంతోషం

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంతో మాట్లాడిన మహిళలు

సాక్షి, అమరావతి: ‘‘మళ్లీ మళ్లీ మీరే సీఎంగా రావాలి.. మీలాంటి అన్నదమ్ములుంటే మాకు ఏ లోటూ ఉండదు... మీకు వేల కోట్ల వందనాలు..’’ అని వైఎస్సార్‌ చేయూత పథకం లబ్ధిదారులు సీఎం జగన్‌తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. బుధవారం పథకం ప్రారంభమైన సందర్భంగా వివిధ జిల్లాలకు చెందిన మహిళలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేరుగా సీఎం జగన్‌తో మాట్లాడారు. 

కష్టకాలంలో ఆదుకున్నారు..
కరోనా కష్టకాలంలో చేయూత పథకాన్ని మీరు ప్రారంభించారు. మా కుటుంబాలను ఆర్ధికంగా నిలబెట్టేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పెద్ద సంస్ధలతో కలసి ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేయడంపై కూడా సాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.     
– పద్మావతి, ఒంగోలు, ప్రకాశం జిల్లా

వేల గుండెల్లో అన్నగా..
మీకన్నా దేవుడు మాకు లేడు సార్‌.. మీకు వేల కోట్ల వందనాలు. చెప్పిన మాట నిలబెట్టుకుని వేలమంది మహిళల మనసులో అన్నగా నిలిచారు. 
– లక్ష్మీదేవి, సిద్ధరాంపురం, అనంతపురం

మీరున్నారనే ధైర్యం..
మీరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. నా తమ్ముడు ఉన్నాడనే ధైర్యంతో ఉన్నాం. ఇది చిరస్మరణీయమైన రోజు. మీరిచ్చిన చేయూతతో  డీటీపీ సెంటర్, కిరాణా షాపు పెట్టి నా కాళ్లపై నిలబడతా. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.     
–రత్నం, యూ.కొత్తపల్లి, తూర్పు గోదావరి

చిరకాల కోరిక సాకారం..
జిరాక్స్‌ మిషన్‌ ద్వారా నెలకు రూ.3 వేలు ఆదాయం వస్తోంది. ‘చేయూత’ ద్వారా నా చిరకాల కోరిక పిండి మిల్లు సాకారం కానుంది. మీలాంటి అన్నదమ్ములుంటే మాకు ఏ లోటూ ఉండదు. మీరు పది కాలాలు చల్లగా బతకాలి. అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, పెద్దల నోట ఒకటే మాట.. జగనన్నా, మళ్లీ మిమ్మల్నే గెలిపించుకుంటాం.
– విజయమ్మ(అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా) 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా