ఎంఎస్‌ఎంఈలకు వైఎస్సార్‌ నవోదయం

9 Aug, 2020 05:07 IST|Sakshi

రూ.2,769.82 కోట్ల రుణాలు పునర్వ్యవస్థీకరణ 

ఇంకా 63,515 యూనిట్లకు అర్హత 

గత ఆర్థిక ఏడాది లక్ష్యానికి మించి రుణాల మంజూరు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పది లక్షల మందికిపైగా ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో బ్యాంకులు కూడా అంతే పాత్ర పోషిస్తున్నాయి. 

అత్యధిక ప్రాధాన్యత
► ఎంఎస్‌ఎంఈల రుణాల పునర్వ్యవస్థీకరణకు ప్రత్యేకంగా వైఎస్సార్‌ నవోదయం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు.  
► ఈ పథకం ద్వారా ఎంఎస్‌ఎంఈల రుణాలను వన్‌టైమ్‌ పునర్వ్యవస్థీకరణకు అవకాశం కల్పించారు.  
​​​​​​​► ఇందులో భాగంగా ఇప్పటి వరకు లక్షకు పైగా యూనిట్ల రుణాలను బ్యాంకులు పునర్వ్యవస్థీకరణ చేశాయి. మొత్తం 1,00,738  యూనిట్లకు చెందిన రూ.2769.82 కోట్ల రుణాలను బ్యాంకులు పునర్వ్యవస్థీకరణ చేశాయి.  
​​​​​​​► రుణాల పునర్వ్యవస్థీకరణకు ఇంకా 63,515 ఎంఎస్‌ఎంఈలకు అర్హత ఉందని, వాటి రుణాలనూ త్వరగా పునర్వ్యవస్థీకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను కోరింది.  
​​​​​​​► సీఎం వైఎస్‌ జగన్‌ ఎంఎస్‌ఈలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా గత ప్రభుత్వం బకాయి పెట్టిన రాయితీ సొమ్ము రూ.905 కోట్లనూ విడుదల చేసిన విషయం తెలిసిందే. 
​​​​​​​► బ్యాంకులు కూడా గత ఆర్థిక ఏడాది లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేశాయి.

మరిన్ని వార్తలు