20 వరకు వైఎస్సార్‌ఏఎఫ్‌యూ పీజీసెట్‌ దరఖాస్తు గడువు

5 Sep, 2021 09:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కడపలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో 6 కోర్సుల్లో ప్రవేశాల కోసం రెండేళ్ల పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పీజీసెట్‌)కు దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు నిర్ణయించారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఈసీ సురేంద్రనాథరెడ్డి శనివారం ప్రకటన విడుదల చేశారు. రెండేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్, మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్, మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (పెయింటింగ్‌), మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (అప్లయిడ్‌ ఆర్ట్స్‌), పీజీ డిప్లొమా ఇన్‌ సినిమాటోగ్రఫీ కోర్సుల్లో 2021–22 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

అర్హతలు, ఇతర వివరాలకు www.ysrafu.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. ఈ కోర్సుల్లో చేరాలనుకొనే వారు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీ నిర్వహిస్తున్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–2021 రాయవలసి ఉంటుంది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 20 చివరి తేదీ. ఆలస్య రుసుముతో ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  వివరాలకు 8790571779 నంబర్‌లో సంప్రదించవచ్చు.

ఆయా కోర్సుల్లో సీట్లు ఇలా..
మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌: 20 సీట్లు 
మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌: 20 సీట్లు
మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌
(పెయింటింగ్‌): 20 సీట్లు
మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌
(అప్లయిడ్‌ ఆర్ట్స్‌): 20 సీట్లు
పీజీ డిప్లొమా 
ఇన్‌ సినిమాటోగ్రఫీ: 20 సీట్లు
పీజీ డిప్లొమా ఇన్‌ 
సైంటిఫిక్‌ వాస్తు శాస్త్ర: 20 సీట్లు  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు