వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో సంబరాలు

18 Oct, 2020 14:42 IST|Sakshi

 సాక్షి, విశాఖపట్నం : బీసీల అభివృద్ధి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ బీసీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్‌, జ్యోతిరావుపూలే విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే జోగి రమేష్‌, పార్టీనేతలు లేళ్ల అప్పిరెడ్డి, చల్లపల్లి మోహనరావు తదితరులు పాల్గొన్నారు. 
(చదవం‍డి : 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..)

సీఎం జగన్‌కు ధన్యవాదాలు
బీసీలకు 56 కార్పొరేషన్లు ఇవ్వడంపై వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. జిల్లా నుంచి నూతనంగా ఎన్నికైన చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్‌ నిర్ణయంతో బీసీలందరూ పండగ చేసుకుంటున్నారని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సీఎం జగన్‌ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. 

ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు సీఎం జగన్‌ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది అని ప్రశంసించారు.  చంద్రబాబు నాయుడు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. బీసీలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడం కోసం సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బీసీల గుండెల్లో చిరస్థాయిగా సీఎం జగన్‌ నిలిచిపోతారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు