‘చంద్రబాబును ప్రజలు ఎప్పుడో క్విట్ చేశారు’

29 May, 2022 14:16 IST|Sakshi

సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర ఆదివారం మధ్యాహ్నం.. కర్నూల్‌లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మహనీయుల ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఎన్నికల కోసం బీసీ, ఎస్సీ ఎస్టీల వర్గాలను చంద్రబాబు వాడుకొని వదిలేశారని, కానీ బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించడంతో పాటు వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. పేద ప్రజల కోసం సామాజిక న్యాయం చేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

టీడీపీ పనైపోయింది: మంత్రి బొత్స
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. మహానాడులో పార్టీ విధానాలు చెప్పకుండా అసభ్యంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. మంత్రులుగా పనిచేసినవాళ్లను అంత నీచంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబుని ప్రజలు ఎప్పుడో క్విట్ చేశారని, టీడీపీ పనైపోయిందని, ఆ విషయం మహానాడుతో స్పష్టమైందని తెలిపారు. ‘మా అవినీతిని బయటపెట్టడానికి మూడేళ్లు పట్టిందా, అవినీతిపై చర్చకు సిద్ధం.. వాళ్ల అవినీతి చిట్టా అంతా విప్పుతామంటూ’ ధ్వజమెత్తారు. ధరల పెరుగుదలపై చంద్రబాబు ఎందుకు బీజేపీని ప్రశ్నించడం లేదని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు