సీఎం జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ దళిత ఎమ్మెల్యేలు

21 Mar, 2023 07:33 IST|Sakshi

ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై టీడీపీ ఎమ్మెల్యే దాడిని వివరించిన శాసనసభ్యులు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శాసనసభలోని ఆయన కార్యాలయంలో సోమవారం వైఎస్సార్‌సీపీ దళిత ఎమ్మెల్యేలు కలిశారు. శాసనసభలో పార్టీ ఎమ్మెల్యే టి.జె.ఆర్‌.సుధాకర్‌బాబుపై తెలుగు­దేశం పార్టీ ఎమ్మెల్యే దాడిచేసిన ఘటనను ముఖ్యమంత్రికి వివరించారు.

టీడీపీ ఎమ్మెల్యే దాడిలో సుధాకర్‌బాబు మోచేతికి అయిన గాయం చూపించారు. సీఎంను కలిసిన వారిలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, హోంశాఖ మంత్రి తానేటి వనిత, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, అలజంగి జోగారావు, కిలివేటి సంజీ­వయ్య, వి.ఆర్‌.ఎలీజ, తిప్పేస్వామి, కంబాల జోగులు, వరప్రసాద్,  కొండేటి చిట్టిబాబు, ఆర్థర్, తలారి వెంకట్రావు, రక్షణనిధి తదితరులున్నారు.
చదవండి: స్పీకర్‌పై వికృత చేష్టలు.. దాడి 'అసెంబ్లీకి బ్లాక్‌ డే'  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు