'ఆ పార్టీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి'

12 Mar, 2021 15:43 IST|Sakshi

గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు 11వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్బంగా గుంటూరులో నిర్వహించిన సమావేశంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యేతో ప్రారంభమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దిన దిన ప్రవర్ధమానంగా ఎదిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ మీద పోరాటం చేసి 151 స్థానాలను కైవసం చేసుకొని ఇవాళ రాష్ట్రంలో అధికారం చేపట్టింది అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ‘ఈ సందర్బంగా ఒక విషయాన్ని చాలా స్పష్ట్టంగా చెప్పాలి మేనిఫెస్టోకు పవిత్రత ఇచ్చిన పార్టీ ఏదైనా దేశంలో ఉంది అంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు. ఏపీలో వైఎస్సార్ పార్టీ చాలా గొప్పగా ఎదిగింది. ఈ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న పాలనతో భవిష్యత్ లో జగన్ ను ఓడించే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదు’

పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ ఎన్నికల తరువాత టీడీపీ ఉనికి లేకుండా పోతుంది. ఆ పార్టీకి రాబోయే శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఏర్పడనుంది. ఓటమి కంటే పోటి చేయకుండా ఉండటమే మేలనుకుంటారు. సత్తెనపల్లిలో పది సీట్లకు అభ్యర్థులు దోరకని దుస్థితి టీడీపీది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తెనపల్లిలో ప్రశాంత వాతావరణం చెడగొట్టానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారు. రాజకీయ శత్రువులు వ్యక్తిగతంగా శత్రువులుగా మారకుడదు. పోలింగ్ జరిగే సమయంలో బూత్ దగ్గరకు టీడీపీ నాయకులు రావటం సమంజసం కాదు. దీనికి మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు సమాధానం చెప్పాలి. అన్ని రాజకీయ పార్టీలు ప్రశాంతంగా పోలింగ్ చేసుకోవటానికి సహకరించాలి. గొడవలు పడతాం ఘర్షణ పడతాం అంటే చూస్తు ఉరుకోం’ అని అంబటి స్పష్టం చేశారు.

చదవండి:

పదేళ్ల ప్రయాణం.. సీఎం జగన్‌ భావోద్వేగ‌ ట్వీట్ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు