గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు

18 Aug, 2022 13:43 IST|Sakshi

తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,004 సచివాలయాలకు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. మరోవైపు.. గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం రూ. 3 వేల కోట్ల కేటాయించింది.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి ఆత్మీయ ఆదరణ లభిస్తోంది. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌కి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తోన్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, అర్హులకు అవి అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకుంటున్నారు. 

ఇదీ చదవండి: CM YS Jagan: గడప గడపకూ మనలో ఒకడై..

మరిన్ని వార్తలు