బంగారు జగనన్నకి బంగారం రాఖీ కట్టిన శైలజాచరణ్‌ రెడ్డి

4 Jul, 2023 18:22 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: చిత్తూరు డెయిరీ పునరుద్ధరణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం భూమి పూజ చేశారు. రూ. 385 కోట్లతో చేపడుతున్న ఈ పునరుద్ధరణ పనులకు భూమి పూజ చేసి ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన మరో కీలకమైన హామీ ఆచరణకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్‌. ఈ మేరకు ఆయన నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. 

దీనిలో భాగంగా సీఎం జగన్‌కు మహిళా శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజినల్‌ చైర్‌పర్సన్‌, చంద్రగిరి నియోజకవర్గ పరిశీలకురాలు శైలజా చరణ్‌ రాఖీ కట్టారు. అది కూడా బంగారంతో చేసిన రాఖీ కట్టారు. బంగారంలాంటి మనసున్న జగనన్నకు ఏమిచ్చినా తక్కువ కాబట్టి మహిళా లోకం తరఫు నుంచి బంగారం రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు శైలజా చరణ్‌రెడ్డి. 

చదవండి: బాబు వెన్నుపోటు వీరుడు.. పవన్‌ ప్యాకేజీ శూరుడు: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు