‘బీసీల వెనుకబాటుకు కారణం చంద్రబాబే’

3 Dec, 2022 13:44 IST|Sakshi

జయహో బీసీ మహాసభపై వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతల సమావేశం

సాక్షి, అమరావతి: జయహో బీసీ మహాసభపై వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతల సమావేశం శనివారం.. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఎంపీలు, విజయసాయిరెడ్డి, ఆర్‌ కృష్ణయ్య, మంత్రులు జోగి రమేష్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు.

సామాజిక  న్యాయం  జగన్‌కే  సాధ్యం: జోగి రమేష్‌
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ, ఈ నెల 7న  జయహో బీసీ మహా సభకు వివిధ  హోదాలో  ఉన్న  బీసీ ప్రజా ప్రతినిధులు  80 వేలకు పైగా  హాజరవుతారని తెలిపారు. సామాజిక  న్యాయం  జగన్‌కే  సాధ్యమని, ఈ మూడున్నరేళ్లలోనే చాటి  చెప్పారన్నారు. బీసీలంతా తలెత్తుకుని తిరిగేలా గౌరవం  ఇచ్చారని అన్నారు. 

బీసీలకు అత్యంత  ప్రాధాన్యత: ఆర్‌. కృష్ణయ్య
ఎంపీ ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ,  గతంలో  ఏ  సీఎం చేయని విధంగా వైఎస్‌ జగన్ బీసీలకు న్యాయం చేశారన్నారు. దేశానికి  వెన్నెముక  అయిన  బీసీలకు సీఎం జగన్ అత్యంత  ప్రాధాన్యత  ఇచ్చారన్నారు. అభివృద్ధి  అంటే  అధికారంలో  వాటా ఇవ్వడం, సంక్షేమ  పథకాలు  అమలు చేయడమే. బీసీల విషయంలో  సీఎం ఇదే  చేస్తున్నారని కృష్ణయ్య అన్నారు.

చంద్రబాబు అబద్దాలను నమ్మే పరిస్థితులు లేవు : మంత్రి వేణు గోపాలకృష్ణ
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ, వెనుక వరసలో ఉన్న బీసీలను సీఎం జగన్ ముందుకు  తెచ్చారన్నారు. పేదరికం పెద్ద రోగం కాబట్టి  విద్య  అనే   ఆయుధం అందించారన్నారు. బీసీల వెనకబాటుకు  ప్రధాన  కారణం  చంద్రబాబు. బీసీలను విద్య కోసం  విదేశాలకు  వెళ్లకుండా అడ్డుకున్నారు. ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసం బీసీలను బాబు వాడుకున్నారు. ఈ నెల 7న 80 వేల మంది బీసీలు ఒకే  వేదిక పైకి రాబోతున్నారు. చంద్రబాబును చూస్తే మాకు ఇదేం ఖర్మ అని బీసీలు అనుకుంటున్నారు. చంద్రబాబు అబద్దాలను నమ్మే పరిస్థితులు రాష్ట్రంలో లేవు’’ అని మంత్రి వేణుగోపాలకష్ణ అన్నారు.

మరిన్ని వార్తలు