రమ్య మృతి ఘటన: ప్రభుత్వ చర్యలపై జాతీయ ఎస్సీ కమిషన్ సంతృప్తి

24 Aug, 2021 14:34 IST|Sakshi

గుంటూరు: రమ్య మృతిపై ప్రభుత్వం ఎలా స్పందిచిందో జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలిసి వివరించినట్లు వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌​సోషల్ జస్టిస్ గవర్నమెంట్ అడ్వైజర్ జూపూడి ప్రభాకర రావు మాట్లాడుతూ.. 24 గంటల్లోపు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం బాధిత కుటుంబానికి సాయం చేశామన్నారు. ప్రభుత్వ చర్యలకు జాతీయ ఎస్సీ కమిషన్ సంతృప్తి చెందినట్లు పేర్కొన్నారు.

చదవండి: అవినీతికి బ్రాండ్‌ వరదాపురం సూరి

సీఎం జగన్ న్యాయం చేశారని రమ్య కుటుంబసభ్యులే చెప్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు  ప్రభుత్వాలు స్పందించలేదన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వెంటనే స్పందించి నాలుగు రోజుల్లో న్యాయం చేసిందని కమిషన్ చెప్పినట్లు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ఘటనపై చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని జూపూడి ప్రభాకర్‌ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్‌, మేరుగ నాగార్జున, విడదల రజని, లక్ష్మణ్‌రెడ్డి పాల్గొన్నారు.

చదవండి: 200 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

మరిన్ని వార్తలు