ఏపీ వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు

21 Oct, 2021 11:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. రెండున్నరేళ్లుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు.  సీఎం వైఎస్‌ జగన్‌ను టీడీపీ నేత పట్టాభితో తీవ్ర పదజాలంతో దూషింపజేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు.  



అనంతపురం: టీడీపీ బూతు వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష కొనసాగుతోంది. 

కృష్ణాజిల్లా: సీఎం జగన్ పై టీడీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తిరువూరు వైఎస్సార్  కార్యాలయంలో  "జనాగ్రహ దీక్ష దీక్షలో పాల్గొన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, పిఏసియస్ ఛైర్మన్లు, పార్టీ నాయకులు,కార్యకర్తలు నిరసన తెలుతున్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లా: తణుకు రాష్ట్రపతి రోడ్ లో ఎమ్మెల్యే  కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనాగ్రహదీక్ష కొనసాగుతుంది. ఈ సందర్భంగా నేతలు..  సీఎం జగన్ పై టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలపై..    వైఎస్సార్సీపీ  ఆర్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పట్టాభి వెంటనే సీఎం జగన్ కు బేషరతుగా  క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.  జనాగ్రహ దీక్షలో  వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.  

పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు  గాంధీ బొమ్మల సెంటర్లో  జెడ్పీ చైర్మన్ కావురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలో కొనసాగుతుంది. ఈ దీక్షలో  మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ,ఎంపిపి లు చిట్టూరి కనక లక్ష్మి,రావూరి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే  గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష కొనసాగుతుంది.ఈ  జనాగ్రహ దీక్షలో వైఎస్సార్సీపీ శ్రేణులు  భారీగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో.. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి  శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నాయకులు విమర్శలు చేస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవ్వరు చూస్తువూరుకోరని అన్నారు. టీడీపీ నాయకులు ఏ స్థాయికి దిగజారి పోయారో ఈ వ్యాఖ్యలతో అర్థమవుతుందని గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. పవన్ కల్యాణ్ కు పట్టిన గతే చంద్రబాబుకి పడుతుందని అన్నారు.భవిష్యత్ లో ఒక్క సీటుకే..బాబు పరిమితం అవుతారని అన్నారు.

వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పులివెందులలో నిరసనలు కొనసాగుతున్నాయి. స్థానిక బిఎస్ ఎన్ ఎల్  ఆఫీస్ సర్కిల్స్ లో జనాగ్రహ దీక్షల పేరుతో  వైఎస్సార్సీపీ నాయకులు దీక్షలు చేపట్టారు. 

తూర్పుగోదావరి జిల్లా: టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాజోలులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనాగ్రహ దీక్షను చేపట్టారు. అదే విధంగా, మండపేట కలువ పువ్వు సెంటర్ లో వైఎస్సార్సీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు,మున్సిపల్ చైర్మన్ నూక దుర్గా రాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు