అమరావతి రైతుల మహాపాదయాత్రకు నిరసన సెగ

8 Oct, 2022 13:13 IST|Sakshi

సాక్షి, పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. అమరావతి రైతుల ముసుగులో టీడీపీ చేస్తోన్న పాదయాత్రపై పాలకొల్లు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

రాజధాని ముసుగులో వస్తున్న తెలుగుదేశం బినామీలు గో బ్యాక్‌.. గో బ్యాక్‌ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ''ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు, వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మధ్య చిచ్చు వద్దు, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే.. మూడు రాజధానులుగా అమరావతి, కర్నూలు, విశాఖపట్నం కావాలి, రాజధాని ముసుగులో తెలుగుదేశం బినామీ నాయకులు గోబ్యాక్‌ గోబ్యాక్‌'' అంటూ ఫ్లెక్సీల్లో నినాదాలు ముద్రించారు. 

చదవండి: (స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను అందించిన కరణం ధర్మశ్రీ)

మరిన్ని వార్తలు