‘రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు’

19 Nov, 2022 13:21 IST|Sakshi

సాక్షి, కర్నూలు: రాష్ట్రాభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. చంద్రబాబును ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కాగా, మంత్రి జయరాం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సానుభూతి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబుకు ఇప్పటికే చివరి ఎన్నికలు అయిపోయాయి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయరు. చంద్రబాబును ఇప్పటికే ప్రజలు తిరస్కరించారు అని అన్నారు. 

ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజం..
సాక్షి, అనంతపురం: తన రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు.  ప్రజలను నిత్యం మోసం చేయడమే చంద్రబాబు నైజం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే దుర్భాషలాడతారా?. వికేంద్రీకరణవాదులపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిజస్వరూపాన్ని చూపించారు. ఏపీ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు  ఉండటం ప్రజల దురదృష్టం. రాష్ట్ర ప్రయోజనాలతో చంద్రబాబు, పవన్‌ చెలగాటం ఆడుతున్నారు. అమరావతిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రాజధాని నిర్మించలేకపోయారు. 

రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. 
సాక్షి, విజయవాడ: అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడలేక చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఆగ్రహం ‍వ్యక్తంచేశారు. అమరావతి నా నినాదం అని చంద్రబాబు రాయలసీమలో  చెప్పలేకపోయాడు. చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాయలసీమ ద్రోహి చంద్రబాబు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. ఇకనైనా మీ భాషను మార్చుకోకపొతే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. 

మరిన్ని వార్తలు