ప్రజాచైతన్య యాత్రలకు బ్రహ్మరథం

16 Nov, 2020 03:44 IST|Sakshi
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో పాదయాత్ర చేస్తున్న మంత్రి శంకర్‌ నారాయణ, ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

సాక్షి, నెట్‌వర్క్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ పేరిట చేపట్టిన సంఘీభావ పాదయాత్రలు ఆదివారం కూడా కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. విశాఖపట్నం, ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో పాదయాత్రలు కొనసాగాయి.

గుంటూరు జిల్లా పెదనందిపాడులో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు, ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మబగాంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో మంత్రి శంకర్‌ నారాయణ, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎంపీ రంగయ్య పాల్గొన్నారు. రాప్తాడులో ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ కార్యక్రమం చేపట్టారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన పాదయాత్ర చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వర్షంలోనూ పాదయాత్ర నిర్వహించారు.
గౌతంరెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో బైక్‌ ర్యాలీని ప్రారంభిస్తున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడలో వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బైక్‌ ర్యాలీని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెల్లలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, కరప మండలం యండమూరు, జి.భావారంలో వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత పాదయాత్రలు చేశారు. కర్నూలు జిల్లా పాణ్యంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహా్మనందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు.   

మరిన్ని వార్తలు