కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎ‍స్సార్‌సీపీ లేఖ

18 Mar, 2023 21:40 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి/ అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రీకౌంటింగ్‌ చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి శనివారం వైఎస్సార్‌సీపీకి లేఖ రాసింది. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్‌ ఎన్నికను రీకౌంటింగ్‌ చేయాలని లేఖలో కోరింది. 

ఇక, కౌంటింగ్‌ సందర్బంగా వైఎ‍స్సార్‌సీపీ, ఇండిపెండెంట్‌ ఓట్లు టీడీపీ ఖాతాలో వేశారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని కలెక్టర్, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు