పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు..

4 Apr, 2021 20:59 IST|Sakshi

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రులు

సాక్షి, నెల్లూరు: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దేనని మంత్రులు అన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జిల్లాలోని చిట్టమూరు మండలం కొత్త గుంట, గూడూరు నియోజకవర్గం పరిధిలో వాకాడు మండలం కేంద్రంలో ఆదివారం జరిగిన బహిరంగ సభల్లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినారాయణ స్వామి, అనిల్‌కుమార్‌ యాదవ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజమండ్రి ఎంపీ భరత్ తదితరులు పాల్గొన్నారు.

95 శాతానికి పైగా హామీలు అమలు..
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, అర్హులందరికీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని.. ఇప్పటికే 95 శాతానికి పైగా హామీలు అమలు చేశామని పేర్కొన్నారు. 90 శాతం ఓటింగ్ జరిగిన గ్రామానికి ప్రత్యేక పారితోషికం అందజేస్తామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

భారీ మెజార్టీతో గెలిపించాలి..
మంత్రి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో రెండో పంటకు నీళ్లిస్తామని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిందన్నారు. డా.గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఎస్సీలను చంద్రబాబు అవమానించారు..
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ, వేషాలు వేసే పవన్‌తో ఉపఎన్నికలో ప్రచారం చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్.. చంద్రబాబును బీజేపీలో చేర్చే కార్యక్రమం చేస్తున్నారని దుయ్యబట్టారు. గూడూరు నుంచి వైఎస్సార్‌సీపీకి లక్ష మెజార్టీ రావాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్సీలను చంద్రబాబు అవమానించారన్నారు.

ఆ ఘనత వైఎస్‌ జగన్‌దే..
పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్‌దేనని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గూడూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్‌సీపీకి లక్ష మెజారిటీ రావాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు.

చంద్రబాబు చాప్టర్ ముగిసింది..
చంద్రబాబు చాప్టర్ ముగిసిందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ, ఏపీలో సీఎం వైఎస్ జగన్ కొత్త ఒరవడి తీసుకొచ్చారన్నారు. బడుగు బలహీనవర్గాలకు సీఎం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని మార్గాని భరత్ పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు