వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌కు అరుదైన గౌరవం

12 Nov, 2021 09:03 IST|Sakshi
ఎమ్మెల్యే ఆర్థర్‌ పేరుతో సిద్ధమైన సర్టిఫికెట్‌  

వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సర్టిఫికెట్‌కు ఎంపిక 

కర్నూలు(రాజ్‌విహార్‌): నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో నియోజకవర్గంలో ఆయన తన వంతుగా సేవలందించారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, కరోనా బాధితులను పరామర్శించడం, సొంత నిధులతో కూలీలు, కార్మికులకు శానిటైజర్లు, మాస్కు​లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సేవలను గుర్తించిన లండన్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సంస్థ  ‘సర్టిఫికెట్‌ ఆఫ్‌ కమిట్‌మెంట్‌’ ఇచ్చేందుకు ఆయనను ఎంపిక చేసింది.

త్వరలో నందికొట్కూరులో జరగే కార్యక్రమంలో ఎమ్మెల్యేను సన్మానించి సర్టిఫికెట్‌ అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం శ్రమించారన్నారు. ఆయన సూచనల మేరకు తాను నియోజకవర్గంలో నిత్యం ప్రజల మధ్య ఉంటూ కోవిడ్‌ నివారణకు కృషి చేశానన్నారు. అధికారులను సమన్వయం చేస్తూ లాక్‌డౌన్‌ అమలు, కరోనాపై ప్రజలకు అవగాహన కలి్పంచామన్నారు.   
 

మరిన్ని వార్తలు