స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం

9 Apr, 2021 13:15 IST|Sakshi

జీవీఎంసీ తొలి కౌన్సిల్‌ సమావేశం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై చర్చ

స్టీల్‌ప్లాంట్‌‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం

సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా జీవీఎంసీ కౌన్సిల్‌లో మేయర్ హరి వెంకటకుమారి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్టీల్‌ప్లాంట్‌‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనిపై జీవీఎంసీ కౌన్సిల్‌లో చర్చ జరిగింది.

టీడీపీ మాదిరిగా మాది ద్వంద్వ విధానం కాదు..
ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం వైఎస్‌ జగన్ చెప్పారని ఆయన తెలిపారు. టీడీపీ మాదిరిగా మాది ద్వంద్వ విధానం కాదన్నారు. ఢిల్లీలో హోదా వద్దన్న చరిత్ర టీడీపీదని ఆయన మండిపడ్డారు. ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుపడటంతో.. చంద్రబాబు పేరు ఎత్తగానే ఎందుకు ఉలిక్కిపడుతున్నారంటూ గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు.
చదవండి:
‘టీడీపీ త్వరలో తెరమరుగయ్యే పార్టీ’
‘కూన’ గణం.. క్రూర గుణం 

 

మరిన్ని వార్తలు