YSRCP MLA Roja Birthday Speical: కౌంటర్‌ స్టార్ట్‌ అయితే.. చుక్కలే!

17 Nov, 2021 13:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాజకీయాల్లో తనదైన వ్యక్తి‍త్వంతో దూసుకుపోతున్న చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా. చక్కటి  వాగ్ధాటి, పదునైన విమర్శలు ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. సందర్భం ఏదైనా, మాటల తూటాలతో రోజా కౌంటర్‌ ఇస్తే ప్రత్యర్థులకు చుక్కలే. చెదరని చిరునవ్వు, ధైర్యానికి, సాహసానికి పెట్టింది పేరు రోజా. సినిమా రంగంమైనా, రాజకీయరంగమైనా తనదైనముద్ర. అటు రాజకీయ నేతగా, ఇటు బుల్లితెరపై సెలబ్రిటీగా రాణిస్తున్న ఘనత రోజా సొంతం. 

అంతేనా అమ్మగా, మహిళగా దాతృత్వంలోనూ  రోజాది పెద్దమనసు. ఎమ్మెల్యే రోజా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్ష లందిస్తోంది సాక్షి. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో విలసిల్లుతూ ఆశయ సాధనలో  మున్ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. 

మరిన్ని వార్తలు