అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్ర ద్రోహి..

9 Aug, 2020 19:46 IST|Sakshi

నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్

సాక్షి, నర్సీపట్నం: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో  మిగిలిపోతారని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిని భ్రమరావతిగా చూపి  టీడీపీ నేతలు అక్కడ భూములను దోచుకున్నారని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి 60 కూడా నెరవేర్చని చేతగాని ప్రభుత్వం టీడీపీ అని విమర్శలు గుప్పించారు.

అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానిదేనని గర్వంగా చెబుతున్నామన్నారు. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు సోషల్‌ మీడియా ద్వారా ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని ఉమాశంకర్‌ గణేష్‌ హితవు పలికారు.

మరిన్ని వార్తలు