అమరావతి రైతులకు అండగా ఏపీ సర్కార్‌

24 Aug, 2020 16:58 IST|Sakshi
డొక్కా మాణిక్య వరప్రసాద్‌

సాక్షి, తాడేపల్లి : అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మరోసారి స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన ట్రాప్‌లో పడొద్దని అమరావతి రైతులకు సూచించారు. స్థానిక రైతులను అండగా ప్రభుత్వం ఉంటుందని, వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా ప్రభుత్వంతో చర్చించవచ్చని తెలిపారు. రాజధాని ప్రాంతంలో జరిగే ఉద్యమానికి దళితులకు సంబంధం లేదని స్పష్ట చేశారు. రాజధాని భూములపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీడీపీ నేతలు విమర్శించడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. (అవినీతి చేయాలంటే భయపడాలి: సీఎం జగన్‌)

తాడేపల్లిలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డొక్కా మణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ.. దళితులకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకున్న చంద్రబాబు నాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు తెలపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అమరావతిలో దళితులకు  52 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు కోర్టులో కేసులు వేశారని మండిపడ్డారు. కేసులు వేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కోర్టు సుమోటుగా స్వీకరించి విచారణ జరపాలని ఆయన కోరారు. 

>
మరిన్ని వార్తలు