పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి

5 Oct, 2022 09:19 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖల స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా నియామకం

సాక్షి, అమరావతి: కేంద్ర రహదారులు, నౌకాయానం, పౌరవిమానయానం, పర్యాటక, సాంస్కృతిక శాఖల  పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్‌పీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.  

తన నియామకం పట్ల విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. రవాణా, పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా నియమించినందుకు ఉప రాష్ట్రపతి జగ్దీప్‌ దన్‌ఖడ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తాను ఈ స్థాయికి చేరడానికి కారకులైన సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు. తనపై అపార విశ్వాసం ఉంచిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషికి కృతజ్ఞతలు తెలిపారు.  

చదవండి: (గుడ్‌న్యూస్‌: ఉద్యోగులకు ‘ఈ–స్కూటర్లు’)

మరిన్ని వార్తలు