బిల్డప్పుల లోకేసం.. నీకంత సీన్‌ లేదు

13 Jun, 2021 13:49 IST|Sakshi

సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై అక్కసు వెల్లగక్కుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకిపడేశారు. పనిలో పనిగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు చురకలంటించారు. ట్విట్టర్‌ వేదికగా ఈ మేరకు ఆయన ఆదివారం వరుసగా ట్వీట్లు చేశారు.
 
రాష్ట్రంలోని సమస్యల్ని పరిష్కారించడం కోసం సీఎం జగన్‌గారు ఢిల్లీ వెళ్తే.. బాబు, ఆయన బానిసలు, ఎల్లో మీడియా అంతా కలిసి గుండెలు బాదుకుని నెత్తుటి వాంతులు చేసుకుంటున్నాయని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. యువ సీఎం ఇమేజ్‌ పెరుగుతోందనే అసూయ, దుగ్ద స్పష్టంగా చంద్రబాబులో కనిపిస్తోందని, జనాలు తిరస్కరించడంతో రాజకీయంగా సమాధి అయిపోయావని మండిపడ్డారు. ‘‘విపత్కర పరిస్థితుల్లోనూ చంద్రబాబు హైదరాబాద్ ఇంటి నుంచి కదలడని, జూమ్ లో కోతలు - పచ్చ మీడియాలో బాకాతో సరిపెడుతున్నాడని సెటైర్లు వేశారు. ‘లేస్తే మనిషిని కాదంటాడు. కానీ లేవలేడు. బయటకు రాలేడు. ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టేస్తా, ఆస్పత్రులు కట్టించేస్తా అంటాడు. మాటలు కోటలు దాటినా కళ్లు మాత్రం ఇల్లు దాటవు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్లు వేశాడు.

మళ్లీ ఎన్నికవుతావా?
ఎల్లో మీడియా ఇస్తున్న ఎలివేషన్లతో లోకేసం(నారా లోకేష్‌) నిజంగా తనో పెద్ద నాయకుడిననే భ్రమల్లో బతికేస్తున్నాడని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ‘ఎమ్మెల్సీ గడువు దగ్గర పడుతోంది. మళ్లీ ఎన్నికయ్యేంత సీన్ నీకు లేదు. మిడిమిడి జ్ఞానంతో అవాకులు చెవాకులు పేలుతూ ప్రజలకు హాస్యం పంచడం తప్ప ఎవరికీ పైసా ప్రయోజనం లేదు’ అంటూ ట్వీట్‌ వేశారాయన.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు