కేంద్ర అఖిలపక్ష సమావేశం ప్రారంభం

18 Jul, 2021 12:40 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

హాజరైన వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి

సాక్షి, ఢిల్లీ: కేంద్ర అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ భేటీలో కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్రం కోరనుంది. సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి హాజరయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌, పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు, ప్రత్యేక హోదా అంశాలను వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రస్తావించనున్నారు.

మరిన్ని వార్తలు