రఘురామకృష్ణరాజుపై ప్రధానికి వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు

26 Jul, 2021 20:50 IST|Sakshi
ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

ఫిర్యాదుతో పాటు కీలక ఆధారాలు సమర్పించిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

సాక్షి, ఢిల్లీ: రఘురామకృష్ణరాజుపై ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు కీలక ఆధారాలను వైఎస్సార్‌సీపీ ఎంపీలు సమర్పించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు.. రఘురామ దేశం విడిచి పారిపోకుండా కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.

రఘురామకు, టీవీ5 చైర్మన్‌ నాయుడుకు మధ్య 11 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయని, అక్రమ నగదు చలామణి చట్టం, ఫెమా కింద కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. రఘురామ, నాయుడులను కస్టడీలోకి తీసుకోవాలని, అక్రమ లావాదేవీల గుట్టు బయటకు తీయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు కోరారు.
 

మరిన్ని వార్తలు