కేంద్రమంత్రి గడ్కరీతో వైఎస్సార్‌సీపీ ఎంపీల భేటీ

27 Jul, 2021 18:24 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్రమంత్రి గడ్కరీతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు సమావేశమయ్యారు. సబ్బవరం - నర్సీపట్నం- తుని మధ్య రోడ్లను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ట్రైబల్ ఏరియాలో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.3 లక్షలు ఇవ్వాలి: ఎంపీ మాధవి
ట్రైబల్ ఏరియాలో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.3 లక్షలు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మాధవి విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో మంగళవారం ఆమె మాట్లాడుతూ, పీఎమ్‌ఏవై కింద 350 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి కేంద్రం ఇస్తున్న రూ.1.8 లక్షలు సరిపోవడం లేదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. గిరిజనుల నివాసిత ప్రాంతాల్లో దాన్ని రూ.3 లక్షలకు పెంచాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు