రాజధాని అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి 

15 Sep, 2020 06:44 IST|Sakshi

పార్లమెంట్‌లో పట్టుపట్టనున్న వైఎస్సార్‌సీపీ 

ఎంపీల సమావేశంలో నిర్ణయం

సాక్షి, అమరావతి :  రాజధాని అమరావతిలో అక్రమాల నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణకు పార్లమెంట్‌లో పట్టుపట్టాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ మొదలు కావాల్సిన వారికి లబ్ధి కలిగించేలా గత చంద్రబాబు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకున్న విషయం విదితమే. మంత్రి వర్గ ఉపసంఘం చేపట్టిన అధ్యయనంలో ఈ అక్రమాలన్నీ బయటపడ్డాయి. ఆ వివరాలు ఇలా..  

  • రాజధాని ప్రకటనకు ముందే రాజధాని ఎక్కడ ఉంటుందనే సమాచారాన్ని ప్రభుత్వ పెద్దలు లీక్‌ చేసి, తమ అనుయాయుల ద్వారా అక్కడ చాలా తక్కువ ధరకు భూములు కొనిపించారు. తెల్లకార్డు ఉన్న వారిని బినామీలుగా పెట్టి భూములు కొన్నారు.  కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాలను రాజధాని ప్రకటనకు ముందే రహస్యంగా కొనుగోలు చేసినట్లు రిజిష్ట్రేషన్‌ రికార్డుల ద్వారా తేలింది. ఇది పక్కాగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌. 
  • ఈ వ్యవహారంలో అప్పటి సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌కు దగ్గరి వ్యక్తి వేమూరి రవికుమార్, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే జీవీఎస్‌ ఆంజనేయులు, లింగమనేని రమేష్, టీడీపీ నాయకులు పయ్యావుల కేశవ్, కంభంపాటి రామ్మోహనరావు, లంకా దినకర్, పుట్టా మహేష్‌యాదవ్, ధూళిపాళ నరేంద్ర తదితరులున్నారు.   
  • చంద్రబాబుకు దగ్గరి వ్యక్తి లింగమనేని రమేష్, మాజీ మంత్రులు పి. నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, నారా లోకేష్, రావెల కిషోర్‌బాబు, కోడెల శివప్రసాదరావు, పల్లె రఘునాథ్‌రెడ్డి, ధూళిపాళ నరేంద్ర, పయ్యావుల కేశవ్, మురళీమోహన్, జీవీ ఆంజనేయులు బినామీ పేర్లతో రాజధాని, రాజధాని రీజియన్‌లో భూములు కొన్నారు.  రాజధాని, రాజధాని రీజియన్‌ హద్దులను కూడా వారికి లబ్ధి కలిగేలా మార్చారు. తద్వారా బాలకృష్ణ దగ్గరి బంధువు ఎంఎస్‌పీ రామారావు, లింగమనేని రమేష్‌ భారీగా లబ్ధి పొందారు. కొందరు టీడీపీ నేతలు లంక, పోరంబోకు, ప్రభుత్వ భూములను తమవిగా చూపించి ప్లాట్లు పొందారు. రెవెన్యూ రికార్డులనూ తారుమారు చేశారు.  
  • ఐదు ప్రైవేటు సంస్థలకు 850 ఎకరాలను అతి తక్కువ ధరలకు కేటాయించారు. 900 ప్లాట్లను సంబంధికులకు కాకుండా వేరే వారికి రిజిస్టర్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం–1989ని ఉల్లంఘించారు.      

ఫైబర్‌ గ్రిడ్‌

  • సీబీఐ విచారణ కోసం పార్లమెంట్‌లో ఒత్తిడి తేనున్న వైఎస్సార్‌సీపీ
  • ఈవీఎం దొంగ వేమూరు హరికృష్ణ ద్వారా చంద్రబాబు, లోకేష్‌ అక్రమాలు
  • రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని తేల్చిన కేబినెట్‌ సబ్‌ కమిటీ

సాక్షి, అమరావతి: ఫైబర్‌ గ్రిడ్‌ అక్రమాలను నిగ్గు తేల్చడానికి వేగంగా విచారణ జరిపించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు నిర్ణయించారు. ఈవీఎం దొంగ వేమూరు హరికృష్ణను ముందు పెట్టి అప్పటి సీఎం చంద్రబాబు, నాటి ఐటీ మంత్రి లోకేష్‌ అక్రమాలకు పాల్పడ్డారని, ఈ కుంభకోణంలో రూ.2 వేల కోట్లకుపైగా అవినీతి జరిగిందని మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే తేల్చింది. ఈ అంశాల్లో మరింత లోతుగా విచారణ చేయడానికి సీబీఐకి కేసు అప్పగించాలని మంత్రివర్గం సైతం తీర్మానించిన విషయం విదితమే.  

  • భారత్‌ నెట్‌ రెండో దశ పనులను టెండర్‌ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించి.. అర్హత లేని టెరా సాఫ్ట్‌వేర్‌ లిమిటెడ్‌ (వేమూరు హరికృష్ణకు చెందినది)కు పనులు అప్పగించారు. అందువల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది. 
  • బీబీఎన్‌ఎల్‌(భారత్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌ వర్క్‌ లిమిటెడ్‌) నిర్ధారించిన దాని కంటే రూ.558.77 కోట్ల అధిక ధరలకు పనులు అప్పగించారు. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదని మంత్రివర్గ ఉప సంఘం ఎత్తి చూపింది. 
  • తక్కువ ధరకు బిడ్‌ దాఖలు చేసిన(ఎల్‌–1) కంపెనీని కాదని.. అధిక ధరకు బిడ్‌ దాఖలు చేసిన టెరాసాఫ్ట్‌కు ఫైబర్‌ గ్రిడ్‌ దక్కేలా చక్రం తిప్పారు.  
  • రెండో దశ పనుల టెండర్లలో అప్పటి సీఎం చంద్రబాబు, నాటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ భారీ అక్రమాలకు పాల్పడ్డారు. 
  • సెట్‌ టాప్‌ బాక్స్‌ల టెండర్లలో 8 సంస్థలు పాల్గొంటే.. తక్కువ ధరకు కోట్‌ చేసిన సంస్థకు పనులు అప్పగించకుండా.. నాలుగు సంస్థలకు పనులు విభజించి, అప్పగించారు. కానీ.. సెట్‌ టాప్‌ బాక్స్‌లను కేవలం టెరాసాఫ్ట్‌ నుంచే కొనుగోలు చేసి, బిల్లులు చెల్లించారు. తీరా సెట్‌ టాప్‌ బాక్స్‌ల్లో నాణ్యత లేదని తేలింది. 
  • ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ద్వారా 13 జిల్లాల్లో పైబర్‌ గ్రిడ్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కోసం కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేయడానికి టెండర్లు ఖరారు చేసే వరకు ఆ పనులను నెలకు రూ.2,44,01,865తో టెరా సాఫ్ట్‌కు అప్పగించారు. 
మరిన్ని వార్తలు