నెల్లూరు ఉదయగిరిలో పొలిటికల్‌ హీట్‌.. వంచనపై వైఎస్సార్‌సీపీ కన్నెర్ర

31 Mar, 2023 10:42 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: ఉదయగిరి నియోజకవర్గంలో తాజా పరిణామాలతో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన వంచనపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు కన్నెర్ర చేశాయి. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు ధర్నా చేపట్టారు.

పార్టీ ద్రోహి చంద్రశేఖర్‌రెడ్డి నియోజకవర్గం వదిలివెళ్లిపో, వైఎస్సార్‌సీపీ దెబ్బేంటో రుచి చూపిస్తామంటూ అంటూ ఫ్లకార్డులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు ర్యాలీ తీశారు.  రోడ్డుపై బైఠాయించారు. చంద్రశేఖర్‌రెడ్డి వర్సెస్‌ వైఎస్సార్‌సీపీతో ఉదయగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు భారీగా మోహరించారు.

మరోవైపు చంద్రశేఖర్‌రెడ్డిపై పార్టీ నేత  మూల వినయ్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రశేఖర్‌రెడ్డి చరిత్ర అంతా అవినీతిమయమేనని అన్నారు. మరో నేత చేజర్ల సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రశేఖర్‌రెడ్డికి పది ఓట్లు కూడా రావన్నారు. ఇక జిల్లా ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గెలిచే దమ్ముందా? అంటూ చంద్రశేఖర్‌రెడ్డిని నిలదీశారు.

మరిన్ని వార్తలు