Beeda Masthan Rao Political Profile: వ్యాపార, రాజకీయాలతోనే కాదు..

17 May, 2022 20:07 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: బీసీ కోటాలో వైఎస్సార్‌సీపీ తరపున అభ్యర్థిగా రాజ్యసభకు ఎంపికయ్యారు బీద మస్తాన్‌ రావు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వ్యాపారంలో ఎదిగి.. తిరిగి రాజకీయాలతోనే రాణిస్తున్నారాయన.  

ప్రముఖ వ్యాపారవేత్త, వైఎస్సార్‌సీపీ నేత బీద మస్తాన్‌రావు.. జులై 2, 1958లో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో జన్మించారు. విద్యార్హత.. బీకాం, సీఏ(ఇంటర్‌). బీసీ యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. స్థానికంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది.

రాజకీయాలు, వ్యాపారాలతో పాటు సామాజిక సేవ, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతోనూ గుర్తింపు దక్కించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల పనితీరును పరిశీలిస్తున్నారు బీద మస్తాన్‌రావు.

విద్య పూర్తయ్యాక.. చెన్నైలో ఓ ప్రముఖ హోటల్‌ గ్రూప్‌నకు ఫైనాన్షియల్‌ మేనేజర్‌గా పని చేసిన బీద మస్తాన్‌రావు..  అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. బోగోల్‌ మండలం జెడ్‌పీటీసీ సభ్యుడిగా మొదలుపెట్టి.. ఎమ్మెల్యేగానూ పని చేశారు.

బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కార్మిక, పరిశ్రమల, ఉపాధి శిక్షణ, పర్యాటక, సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు. 2019లో నెల్లూరు లోక్‌ సభ స్థానానికి పోటీ చేశారు కూడా. 2014 నుంచి 19 మధ్య క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అడ్వైజరీ మెంబర్‌గానూ పనిచేశారు.

మరిన్ని వార్తలు