Niranjan Reddy Political Profile: వ్యవసాయ నేపథ్యం.. చట్టాలపై మంచి పట్టున్న న్యాయ నిపుణుడు

17 May, 2022 21:33 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌:  సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ రాజ్యసభకు అభ్యర్థిగా ఎన్నిక చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుభవం ఉన్న న్యాయ నిపుణుల్లో ఈయన. పైగా కీలక కేసులను వాదించిన అనుభవమూ ఉంది ఈయనకు. అందుకే రాజ్యసభకు ఎంపిక చేసింది వైఎస్సార్‌సీపీ.

జులై 22, 1970 అదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణంలో జన్మించారు నిరంజన్‌రెడ్డి. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. హైదరాబాద్‌లోనే ఉన్నత విద్యంతా పూర్తి చేశారు. పుణెలోని ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబియాసిస్‌లో న్యాయవిద్య అభ్యసించించారు నిరంజన్‌రెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టు అడ్వొకేట్‌గా ప్రాక్టీస్‌. 1994-95 మధ్య సుప్రీం కోర్టులో ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు.

రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కీలక కేసులు వాదించిన నిరంజన్‌ రెడ్డి .. ఎన్నికల సంఘంతో పాటు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకి కొంత కాలం స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్‌ సీనియర్‌ కౌన్సిల్‌గా పలు కేసుల్లో సేవలందించారు కూడా.

మరిన్ని వార్తలు