ఈ నెల 24న అగ్రి గోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

22 Aug, 2021 15:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్ బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర స్ధాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ.. ఆర్బీఐ నిబంధనలకి విరుద్ధంగా టిడిపి ప్రభుత్వ హయాంలో అగ్రి గోల్డ్ను ప్రారంభించారని తెలిపారు. అగ్రి గోల్డ్ యాజమాన్యంతో టిడిపి ప్రభుత్వం కుమ్మక్కై బాధితులకి ‌అన్యాయం చేశారాని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడా ప్రైవేట్ సంస్ధ మూసేస్తే బాధితులకి ప్రభుత్వం న్యాయం చేసిన దాఖలాలు లేవు అని ఆయన అన్నారు.

చదవండి:రాహుల్‌ హత్య కేసులో కీలక పరిణామం, A1 లొంగుబాటు

కానీ, అగ్రి గోల్డ్ బాధితుల కష్డాలని నేరుగా చూసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రభుత్వం తరపున న్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే  20 వేల రూపాయిల లోపు డిపాజిట్లు కట్టిన బాధితులకి న్యాయం చేయాలని వైఎస్ జగన్ చంద్రబాబుని డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. ఈనెల 24న 20 వేల రూపాయలలోపు ఉన్న అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ దారులకు వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు లేళ్ల అప్పిరెడ్డి వివరించారు. ఇప్పటికే  రూ.10వేల లోపు డిపాజిట్‌దారులకు రూ.240 కోట్లు చెల్లించామని, 67 ఎకరాల అగ్రిగోల్డ్ స్థలాన్ని కోర్టుకు స్వాధీనం చేశామని ఆయన వెల్లడించారు.

చదవండి:వైఎస్సార్‌సీపీ మహిళా పక్షపాత ప్రభుత్వం: వాసిరెడ్డి పద్మ

మరిన్ని వార్తలు