సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు

22 Aug, 2021 07:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాఖీ పండగ సందర్భంగా ఒకరోజు ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు రాఖీలు కట్టారు. శనివారం సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ గుప్తా కల్యాణ మండపంలో ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి విచ్చేసిన విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే విడదల రజనీ, వడ్డెర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ గాయత్రి సంతోషిణి సీఎం జగన్‌కు రాఖీలు కట్టారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ రాఖీ శుభాకాంక్షలు : రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ సీఎం జగన్‌ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారిత సాధించేందుకు మనందరి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక చర్యలు చేపట్టిందని తెలిపినట్లు సీఎం కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది.     


 

మరిన్ని వార్తలు