సీఎం జగన్‌కు రాఖీ కట్టిన వైఎస్సార్‌సీపీ మహిళా ఎంపీలు

7 Aug, 2022 12:18 IST|Sakshi

ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరుగుతున్న నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో సీఎం పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైన ఈ సమావేశం సాయంత్రం నాలుగు గంటల వరకు  కొనసాగనుంది.  

అంతకుముందు ఆయన నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా ఎంపీలు రాఖీ కట్టారు. రాఖీ కట్టిన వారిలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, అమలాపురం ఎంపీ చింతా అనురాధ ఉన్నారు. శనివారం రాత్రి  ఢిల్లీ చేరుకున్న సీఎంకు ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్, నందిగామ సురేష్ సహా పలువురు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు.

చదవండి: నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం.. పాల్గొన్న సీఎం జగన్‌

మరిన్ని వార్తలు