ప్రతిపక్షాలకు అసత్య ప్రచారమే పనిగా మారింది: వైవీ సుబ్బారెడ్డి

14 Dec, 2022 13:39 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: పాలన వికేంద్రీకరణపై ప్రతిపక్షాలకు అసత్య ప్రచారమే పనిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి. త్వరలోనే విశాఖ నుంచి పాలన అందించే యోచనలో సీఎం ఉన్నారని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్‌ ఎరీనా థియేటర్‌లో జరుగుతోన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. 

‘త్వరలో విశాఖ నుంచి పాలన యోచనలో సీఎం ఉన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది. విశాఖ వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయం రాష్ట్ర కార్యాలయంగా మారనుంది. ప్రతిపక్ష పార్టీలకు అసత్య ప్రచారమే పనిగా మారింది. వారి దుష్ప్రచారాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు.’ అని పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డి. జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతున్నాయని, ఇప్పటికే తిరుపతి, గుంటూరు-విజయవాడ, రాజమండ్రిలో పూర్తయినట్లు చెప్పారు. మన సంస్కృతి సాంప్రదాయలను ప్రతిబింబించేలా కార్యక్రమం నిర్వహించటం చాలా సంతోషంగా ఉందన్నారు. విశాఖ ఎంతో ప్రాముఖ్యత కలిగిన పర్యటక ప్రాంతమని, విశాఖను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ శ్రేణులో జోష్‌

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు