శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం

21 Sep, 2022 16:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సీఎం కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్‌కు ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు.

సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5 వరకు శ్రీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై, రాష్ట్ర ప్రజల తరపున పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రం అందజేశారు. 

చదవండి: (సీఎం జగన్‌ను కలిసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన)

మరిన్ని వార్తలు