9న అమరావతి శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ 

7 Jun, 2022 05:54 IST|Sakshi
ఏర్పాట్లను పరిశీలిస్తున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు

పాల్గొననున్న గవర్నర్‌ హరిచందన్, సీఎం జగన్, శారదా పీఠాధిపతి 

ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  

తాడికొండ: అమరావతిలో నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో 9వ తేదీన ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య మిథున లగ్నంలో ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ జరగనున్నాయని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి సుబ్బారెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మహాసంప్రోక్షణ కార్యక్రమానికి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి విచ్చేస్తారని తెలిపారు. ఈ ఆలయాన్ని రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించామన్నారు. ఆర్టీసీ అధికారులతో చర్చించి భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు.   

మరిన్ని వార్తలు