భోగాపురం విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన 

15 Dec, 2022 05:07 IST|Sakshi
భూమి పూజ చేస్తున్న వైవీ సుబ్బారెడ్డి, చిత్రంలో మంత్రులు విడదల రజిని, అమర్‌నాథ్‌ తదితరులు

టీటీడీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి 

విశాఖలో పార్టీ నూతన కార్యాలయానికి భూమి పూజ 

సాక్షి, విశాఖపట్నం: భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, అదాని డేటా సెంటర్‌కు త్వరలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని టీటీడీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, విడదల రజిని, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌­బాబుతో కలిసి ఆయన బుధవారం ఎండాడ లా కాలేజీ రోడ్డు పనోరమ హిల్స్‌ వద్ద వైఎస్సార్‌సీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యా­ల­యాల్లో త్వరలో కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసి కార్యకర్తలకు అవసరమైన సేవలు అందిస్తామ­న్నారు. న్యాయ ప­ర­మైన చిక్కులు తొలిగాక విశాఖ పరిపాలన రాజ­ధాని కానుందని చెప్పారు. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, మాజీ మంత్రులు పి.బాలరాజు, దాడి వీరభద్రరావు, నెడ్‌ క్యాప్‌ చైర్మన్‌ కేకే రాజు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు