ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. విగ్రహం మార్పుపై వైవీయూ వీసీ క్లారిటీ

10 Nov, 2022 16:12 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: యోగి వేమన యూనివర్శిటీలో వేమన విగ్రహ ఏర్పాటుని రాజకీయం చేయొద్దని యూనివర్శిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆచార్య మునగాల సూర్యకళావతి కోరారు. న్యాక్‌ గ్రేడింగ్‌లో యూనివర్శిటీ అభివృద్ధి చూసే ఏ గ్రేడ్‌ ఇచ్చారని తెలిపారు. అభివృద్ధి పనులలో భాగంగానే వేమన విగ్రహాన్ని యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పేరుతో ఉన్న యూనివర్శిటీ కాబట్టి ప్రధానం ద్వారం వద్ద ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అందరితో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

'ఎవరికీ ఇబ్బంది లేకుండా వేమన విగ్రహాన్ని మూడు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశాము. యూనివర్సిటీ స్థాపకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కనుక ఖాళీ అయిన వేమన విగ్రహ స్థలంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని పెట్టాము. కొత్త విగ్రహాలు ఏవీ తీసుకుని రాలేదు.. ఉన్న విగ్రహాలనే వేరేచోట మార్చడం జరిగింది. నూతన వైఎస్సార్ పరిపాలన భవనం అని పేరు పెట్టినందున వలన అక్కడే ఉన్న స్థలంలో విగ్రహం ఏర్పాటు చేశాం' అని వైస్‌ ఛాన్సలర్‌ మునగాల సూర్యకళావతి తెలిపారు. 

చదవండి: (యోగివేమన విశ్వవిద్యాలయంకు ‘విశ్వ’ఖ్యాతి)

మరిన్ని వార్తలు