సీఎం వైఎస్‌ జగన్‌కు హజ్‌ పవిత్ర జలం అందజేత 

27 Sep, 2022 04:10 IST|Sakshi
సీఎం జగన్‌కు హజ్‌ పవిత్ర జలాన్ని అందజేస్తున్న హజ్‌ కమిటీ చైర్మన్, సభ్యులు, ఎమ్మెల్సీలు

మైనార్టీల సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని హజ్‌ కమిటీ చైర్మన్, సభ్యులు, ఎమ్మెల్సీలు సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హజ్‌ పవిత్ర జలం (జమ్‌ జమ్‌ వాటర్‌)ను సీఎంకు అందజేశారు.

హజ్‌ 2022 యాత్ర ముగిసిన సందర్భంగా పవిత్ర జలాన్ని ముఖ్యమంత్రికి అందజేసి, మైనారిటీలకు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. సీఎంను కలిసిన వారిలో హజ్‌ కమిటీ చైర్మన్‌ బీఎస్‌ గౌస్‌ లాజమ్, ఎమ్మెల్సీలు రుహుల్లా, ఇషాక్‌ బాషా, హజ్‌ కమిటీ సభ్యులు మునీర్‌ బాషా, ఇమ్రాన్, ఇబాదుల్లా, ఖాదర్, ముఫ్తిబాసిత్‌ తదితరులు ఉన్నారు.

అన్ని సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారు
సీఎంను కలిసిన అనంతరం బీఎస్‌ గౌస్‌ లాజమ్‌ మాట్లాడుతూ కేంద్ర పౌరవిమానయాన శాఖతో సంప్రదించి ఏపీలో హజ్‌ టెర్మినల్‌ ఏర్పాటుకు కృషి చేయాలని, విజయవాడలో హజ్‌ హౌస్‌ నిర్మాణానికి ఆరు ఎకరాల భూమి కేటాయించాలని, వైఎస్సార్‌ జిల్లా కడపలో అసంపూర్తిగా నిలిచిపోయిన హజ్‌ హౌస్‌ను పూర్తి చేయాలని కోరామని తెలిపారు.

హజ్‌ హౌస్‌ కార్యకలాపాల కోసం బడ్జెట్‌లో రూ.4.5 కోట్లు కేటాయించాలని, తద్వారా 2023 సంవత్సరంలో హజ్‌ గురించి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని సీఎం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. వీటన్నింటిని త్వరలోనే నెరవేరుస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.   

మరిన్ని వార్తలు